అంగన్ వాడి కార్యకర్తల దీక్షకు డా. గంగులయ్య మద్దతు

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి అంగన్ వాడీ కార్యకర్తలనుద్దేశించి ఏ పార్టీ తరుపున దీక్ష చేస్తున్నారనడం ప్రభుత్వ శాఖలపై అతనికున్నా అవగాహనారాహిత్యంగా చెప్పవచ్చు జనసేన పార్టీ పాడేరు ఇన్ఛార్జ్ డా. వంపూరు గంగులయ్య జి.మాడుగుల అంగన్ వాడి కార్యకర్తల నిరాహారదీక్షకు పాల్గొని వంతు సంపూర్ణ మద్దతు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు. ఈ సందర్బంగా పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య మాట్లాడుతూ ప్రతి అంశంలోను ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నదన్నారు. సహజ నేరప్రవృత్తి కలిగిన నాయకుడు ఇంతకు మించి ఏమి చేయగలరని ఘాటు విమర్శచేశారు. ఇన్నాళ్లు ఏ ఒక్క రోజు నిరహదీక్ష సభకు హాజరై పరిస్థితి సమీక్షించే సాహసం చేయలేకపోతున్నారు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇలా ప్రజాప్రతినిధులు తమ విధినిర్వహణలో ప్రజాసమస్యలకంటే తమ ప్రచారాలకోసమే ఎక్కువసమయాన్ని వెచ్చించడం ఎటువంటి పరిపాలననో గిరిజన ప్రజలు గుర్తించాలన్నారు. ఒకవైపు నిరుద్యోగ యువతకు మోసం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే ఊసే లేదు, అధికారంలోకి రావడానికి ముందు చేసిన హడావిడి మోసాలు అన్ని ఇన్ని కావు ఇలా రోజుకొక ఉద్యోగ సంఘాలు నిరాహారదీక్ష కు దిగుతుంటే ఈ ప్రభుత్వపరిపాలనపై ఎంతటి వ్యతిరేకత ఎదురవుతోందో వైసీపీ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి వచ్చే ప్రభుత్వం తీసుకునే చర్యలకు సిద్ధం కావాల్సివుంటుందన్నారు. పాడేరులో అంగన్ వాడి కర్తలకు నాలుగురోజుల క్రితమే మద్దతు ప్రకటించమని పోషకాహారం లోపాలు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో అధికంగా ఉందని జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్న కూడా నేటికి 20 రోజులు గడుస్తోంది గిరిజన శిశువులకు పోషకాహారం నిలుపుదల చేసి ఇటువంటి అంతర్గత కుట్రలు ప్రభుత్వాలు ఆధివాసీలపై నిరవధికంగా అనేక అంశాల్లో చేయడం మానుకోవలన్నారు. నిన్న వైసీపీ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి అంగన్వాడీ కార్యకర్తలనుద్దేశించి ఏ పార్టీ దరుపున ఈ దీక్ష చేస్తున్నారనడం అతనికి మతాశిశు సంరక్షణ శాఖ ఒకటుందని అప్పుడే తెలిసినట్టుంది ఇదేనా ప్రభుత్వ తీరంటూ తీవ్ర విమర్శలు చేసారు. సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్ మాట్లాడుతూ ఎన్నికలకు మహిళలంటే అంతా ప్రేమ ఇంత ప్రేమ అంటూ ముద్దులు పెట్టిన మన క్రిమినల్ ముఖ్యమంత్రి నేడు పదే పదే పెళ్లిళ్లు అంశాలపై ప్రస్తావించడం అతని ఆలోచన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు వీళ్ళకి ఓటుతో బుద్దిచెప్పాలన్నారు. ఉపధ్యక్షురాలు మాట్లాడుతు కచ్చితంగా అనేక రంగాల్లో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని అయితే సరైన గుణపాఠం మాత్రం రాబోయే ఎన్నికలకే ఉంటుందన్నారు. జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, మసాడి సింహాచలం, తాంగుల రమేష్ కార్యనిర్వహన సభ్యులు, తల్లే త్రిమూర్తి, బూత్ కన్వినర్ భానుప్రసాద్, జిల్లా కార్యవర్గ నేతలు ఉపాద్యక్షురాలు శ్రీమతి కిట్లంగి పద్మ, కార్యదర్శి ఉల్లిసీతారాం, సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ పలువురు పాల్గోన్నారు.