అమెజాన్ ప్రైమ్‌లో నితిన్ ‘రంగ్ దే’

యువ హీరో నితిన్ భీష్మ హిట్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రం రంగ్ దే. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా రంగ్ దే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు మూడో సినిమా. కాగా రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో సినిమా రిలీజ్ కాక ముందే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. భీష్మ శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్వర్క్ సంస్థ (జీ తెలుగు) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10 కోట్లని సమాచారం అందుతుంది. ఇక రంగ్ దే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ కొనేసిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కూడా అతి త్వరలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుందని సమాచారం. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. రంగ్ దేను జూలై లో విడుదల చేయాలనీ చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.