కరోనాను జయించి ప్లాస్మాను దానం చేస్తా: మెగా బ్రదర్ నాగబాబు

టాలీవుడ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. ఇప్పుడు మెగా ఫ్యామిలీని టచ్ చేసింది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే దీనికి గురించి నాగబాబు నోరు విప్పకముందే రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇప్పుడు ట్విటర్ వేధికగా నాగబాబు విషయాన్ని వెల్లడించారు. తొందరగా కరోనాను జయించి ప్లాస్మాను దానం చేస్తానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే నాగబాబు గత కొన్నిరోజులుగా ఓ ఛానల్‌లో వచ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. బహుశా అక్కడి నుంచే వైరస్ సోకి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగబాబు సూచించారు. నాగబాబు త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు రీట్వీట్లు పెడుతున్నారు.