కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ భరోసాగా నిలుస్తుంది

హైదరాబాద్: క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు . జరిసిన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అయింది. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సభ్యత్వ నమోదును సాంకేతికంగా ప్రారంభించి, మొదటి సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుంది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాజకీయ పార్టీ కార్యకర్తలంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఉపయోగించుకోవడం వరకే పరిమితం అయ్యేవారు.. జనసేన పార్టీ మాత్రం వారిని ఆపదలో ఉంటే ఆదుకునే ఆలోచన చేసింది. కార్యకర్తలకు భరోసా నింపేందుకు, కష్టంలో ఉన్న క్రియాశీలక కార్యకర్తల కుటుంబాల దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి వారికి దైర్యం చెప్పి, పార్టీ తరఫున ఆర్ధిక సాయం చేయాలనే గొప్ప ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. కార్యకర్తల కుటుంబాల వద్దకు వెళ్తున్న సమయంలో వారు చెబుతున్న మాటలు నాయకుడి గొప్ప ఆలోచనను, స్ఫూర్తిని తెలియజేస్తున్నాయి. ప్రమాదవశాత్తు క్రియాశీలక కార్యకర్తకు జరగరానిది జరిగితే, పార్టీ . నుంచి మేమున్నామని వారి కుటుంబానికి అప్లహస్తం అందించే ప్రక్రియ ఇది. పార్టీలో క్రియాశీలక కార్యకర్తలంతా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతున్న వారు, కుటుంబం కోసం కష్టించి పని చేసేవారే, మన జనసేన కుటుంబం ఇంత గొప్పదా అనే స్థాయికి పార్టీని తీసుకెళ్లడంలో అందరి కృపి ఉంది. సభ్యత్వం తీసుకునేందుకు అన్నీ వర్గాల వారు చాలా ఆసక్తిగా ఉన్నారు. వారందరినీ పార్టీకి దగ్గర చేద్దాం, పార్టీ క్రియాశీలక సభ్యులకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం, భవిష్యత్తు పార్టీ కార్యక్రమాలపై శిక్షణ, నాయకులతో ప్రత్యేక ఇంటరాక్షన్లు ఉంటాయి, పార్టీ సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలా క్రియాశీలక కార్యకర్తలు పనిచేయాలి. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లి జగమంత కుటుంబంలా జనసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ మనస్పూర్తిగా కోరుతున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.