కీలగాడ పంచాయితీలో జనసేన ఆత్మీయ సమావేశం

అరకు నియోజకవర్గం: అరకు జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జి చెట్టి చిరంజీవి ఆదేశాలలో భాగంగా ముంచంగిపుట్టు మండలంలో గల ఈ కీలగాడ పంచాయితీ పరిదిలో జనసేన నాయకులు పి మురళి ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో చేరవేసేలా జనసైనికులకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది. అలాగే పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క జనసైనికులు పార్టీ కోసం ముందుకు రావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆర్ శ్రావణ్ కుమార్, పి మురళి, జి సతీష్ కుమార్, సిహెచ్ సూర్యనారాయణ పడల్, గిరి, వెంకటేశ్వ, కిలగాడ జనసైనికులు పాల్గొనడం జరిగింది.