ఘనంగా స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు

తాడేపల్లిగూడెం: భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన స్వామి వివేకానంద 161వ జయంతి పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తోమరాడ చిన్నా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవభట్ల విజయ్ మాట్లాడుతూ యువత ఎప్పుడూ స్వేచ్ఛను కలిగి ఉండాలి. అయితే ఆ స్వేచ్ఛ లోను కాస్త బాధ్యత ఉండాలి అప్పుడే వారి జీవితం సరైన దారిలో నడుస్తుంది అలాగే స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక మాట ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయటంలో ఓడిపోకు, స్వామి వివేకానంద జయంతిని భారతీయ యువజన దినోత్సవంగా జరుపు కోవటం అలాగే ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సోదరుడు చిన్నాకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు నా నమస్కారాలు తెలియ చేసుకుంటున్నానని విజయ్ తెలిపారు.