జనసేనలో చేరిన బి ఆర్ నాయుడు

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గానికి చెందిన జిల్లాలోనే బలమైన సామాజిక వర్గమైన వాల్మీకి బోయ, ప్రముఖ వ్యాపారవేత్త, బీసీ నాయకులు,
బి ఆర్ నాయుడుని ఆదివారం మంగళగిరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నందు పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమంచి స్వాములు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి కండువాతో ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు అలాగే గత పది సంవత్సరాలుగా చేస్తున్న పోరాట పఠిమను స్పూర్తిగా తీసుకుని ఒక జనసైనికుడిగా పార్టీకి అహర్నిశలు సేవ చేయాలనుకుంటున్నాను. గుంటకల్ నియోజకవర్గంలో బిసి సామాజిక వర్గం బలంగా ఉందని, యువతి యువకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీపై ఎంతో మక్కువతో ఉన్నారని త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – టిడిపి కూటమి విజయ డంక మోగించడం ఖాయమన్నారు. పార్టీ విజయం కోసం ముందుండి పోరాడుతానన్నారు. జనసేన పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన వాటికి కట్టుబడి ముందుకు వెళ్తానన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో జనసేన టిడిపి కూటమి అభ్యర్థి విజయం లక్ష్యంగా పనిచేస్తానన్నారు. జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయనున్న బి.ఆర్ నాయుడు.