జనసేన ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పోరాట యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో మోర్త రవణమ్మ ఆధ్వర్యంలో 6వ డివిజన్ రాచర్ల వారి వీధి దగ్గర ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ప్రజలను కలిసి ఈ వై.సి.పి ప్రభుత్వ వైఫల్యాలను వివరించి చైతన్య పరచారు. ఒక జాతి అభివృద్ధి చెందింది అని చెప్పాలంటే వారు నివశిస్తున్న ప్రాంతం రోడ్లు, కాలువలు, వ్యాపారాలు, భవనాలు, పారిశ్రామిక వాడలు వగైరా వగైరా వాటిని బట్టి పరిగణనలోకి తీసుకుంటారనీ, అదేంటో ఈ వై.సి.పి ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేసి అభివృద్ధిలో మన రాష్ట్రం టాప్ అంటున్నాడని సభ్య సమాజం, ఇతర రాష్ట్రాల వాళ్ళు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారన్నారు. ఈ నాలుగున్నర ఏండ్ల చరిత్రని పరిశీలిస్తే నీటి ప్రోజక్టుల గేట్లు కొట్టుకొని పోడం, ఒక ఊరిలో నీటి ప్రోజక్టు తెగిపోయి ముప్పై మంది కొట్టుకుపోయి మరణించడం, పోలవరం ప్రోజక్టు స్థాయిని పరిమితం చేసి రిజర్వయిరులాగ చేయడం, రాజధాని లేకుండా చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే అంతం లేదనీ అసలు ఒక్క నిర్మాణాత్మకమైన పనిపూర్తిచేసాం అని చెప్పి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలకు వెళ్ళగలరా అని ప్రశ్నించారు. ఆఖరుకి ప్రజలు తమ ఓటు జాబితాలో ఉంచుకోడానికి ప్రతి రోజు చెక్ చేసుకోడం చూస్తుంటే ఈ వై.సి.పి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేసారు.