నాదెండ్ల అరెస్టును ఖండించిన పితాని

ముమ్మిడివరం, విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ ఆ కూడలికి వెళ్ళే ప్రయత్నం చేసిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని నోవాటెల్ దగ్గర అరెస్టు చేసిన పోలీసుల తీరును జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తీవ్రంగా ఖండించడం జరిగింది.