రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్

ఏపీ సర్కార్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి సంబంధించి పలు మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు రూపొందించింది. 2021-22 ఆర్థిక ఏడాది నుంచే రైతుల ఖాతాల్లోకి విద్యుత్ నగదు ప్రభుత్వం బదిలీ చేయనుంది. ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్ బిగించి బిల్లులు జారీ చేస్తారు. ఆ బిల్లు మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో ప్రభుత్వం నగద జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతులు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది.