*ఐదేళ్ల వైసీపీ పాలనలో జగనన్నకాలనీలో పూర్తయిన గృహాలు 2లక్షల 6వేలే
*ఏడాది కూటమి పాలనలో లక్ష50వేల గృహాలు పూర్తి
*నాడు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకున్నారు
*జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి పాలనలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ప్రజలు విస్తుపోతున్నారని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిందంతా ఆర్భాటమేనని, ఇల్లు కాదు ఊళ్ళు కడుతున్నామని చెప్పిన జగన్ 2019 నుంచి 2024 మధ్య జగనన్న కాలనీల పేరుతో పూర్తి చేసింది కేవలం 2లక్షల 6వేల గృహాలేనన్న నిజం వెలుగులోకి వచ్చిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో అంతులేని అవినీతి.. అప్పట్లో కొండలు గుట్టలు స్మశానాల దగ్గర ఊరు చివరన ఉన్న స్థలాలను అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసి వైసీసీ నేతల జేబులు నింపినున్నారని, జగనన్న కాలనీలో పేరుతో అంతులేని అవినీతి చోటు చేసుకుందని బాలాజి ఆరోపించారు. చిలకలూరిపేటలో సైతం ఇటువంటి అవినీతి చోటు చేసుకుందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలిపారు. రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చిన 18,34,000 మందిలో 6,34,000 మందికి ఇళ్లు మంజూరు చేయకుండా ఐదేళ్ళు దగ్గా చేశారని, వీటిలో చాలా మందికి ఆ స్థలాలు ఎక్కడున్నాయో కూడా చూపించలేదన్నారు. ఇల్లు మంజూరు చేసిన 12 లక్షల మందిలో అవి నివాసయోగ్యమైనవి కాక 3,54,000 మంది ఒక్క ఇటుకు కూడా పడలేదన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో ఒక్కో ఇంటికి ఇచ్చే రూ. లక్ష80,000 కట్టేందుకు సరిపోవని, అదనపు సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం మరికొంత ఇవ్వాలని లబ్దిదారులు వేడుకున్న జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి మొర ఆలకించి ఎస్సీ ఎస్టీ బీసి ఆదివాసి గిరిజనులకు అదనపు సాయం ప్రకటించిందన్నారు. ఎస్సీలకు బీసీలకు రూ. 50,000 ఎస్టీలకు రూ. 75,000 ఆదివాసి గిరిజనులకు రూ. లక్ష చొప్పున అదనపు సాయం అందించి ఇళ్ల నిర్మాణం వేగం చేసిందని వెల్లడించారు. ఏడాది పాలనలోనే లేఔట్లలో 80,000 గృహాలు లబ్దిదారులు సొంతంగా కట్టుకున్నవి కాగా మరో 70,000 కలిపి మొత్తంలక్ష50వేల గృహాలను పూర్తి చేసిందని వెల్లడించారు.
Share this content:
Post Comment