మొగల్తూరు జెడ్పి హైస్కూల్ కు 1.71కోట్లు మంజూరు..!

నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, మొగల్తూరు గ్రామంలో గల జెడ్పి హైస్కూల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 1.71కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెషి అధికారుల సమక్షంలో నిర్వహించిన, గ్రామ అభివృద్ధి సభలో, మొగల్తూరు గ్రామ ప్రజలు తమ గ్రామంలో గల జెడ్పి హై స్కూల్ అభివృద్ధికి సహకరించాలని కోరగా, ఈ విషయమై స్థానిక శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా చర్చించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వెంటనే స్పందించి, జెడ్పి పాఠశాల అభివృద్ధికి 1.71కోట్లు మంజూరు చేశారని విప్ మరియు శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం ప్రజల విన్నపం మేరకు పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ఎమ్మెల్యే నాయకర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థిని, విద్యార్థులకు ఆధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయకర్ తెలిపారు.

Share this content:

Post Comment