కడప జిల్లాలో పేలుడు..10 మంది మృతి

కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గురాళ్లు వెలికితీసే క్రమంలో పేలుడు జరిగింది.. ఈ ఘటనలో 10మంది కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు దెబ్బకు కూలీల డెడ్‌బాడీలు చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనా స్థలంలో దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ముగ్గురాయి గనిలో పనుల కోసం మొత్తం 40మంది వరకు కూలీల వచ్చినట్లు సమాచారం. వీరంతా బద్వేలు, పోరుమామిళ్లకు చెందినవారిగా తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.