వైసీపీ పార్టీ నుండి జనసేనలో 10 కుటుంబాలు చేరిక

ధర్మవరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణం 29వ వార్డు సుందరయ్య నగర్, సత్య సాయి నగర్ నుండి చెందిన 10 మంది కుటుంబాలు చేరడం జరిగింది. కన్నపనేని రాజేష్, గంతిమేరి నారాయణస్వామి, గూడూరు నరేష్, సాకే ఓబులేష్, కొవూరు దిలీప్ కుమార్, గొర్రె కేద్రీనాథ్, గంతిమేరి బాబు తదితరులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. పార్టీలోకి చేరిన యువత మాట్లాడుతూ యువతను జనసేన పార్టీ అయితేనే ఆదుకుంటుందని ధర్మవరంలో మధు అన్న గెలిస్తేనే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని చేనేతలు పడుతున్న కష్టాలు, యువత పడుతున్న కష్టాలు ఇవన్నీ మధు అన్న ఎమ్మెల్యే అయ్యాక తీర్చి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారన్న నమ్మకంతోనే మేము జనసేన పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలారి ప్రతాప్, కుల్లంపల్లి రమేష్, మురెప్ప శంకర్ నాయుడు, నారాయణస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.