చిరంజీవి చారిిబుల్ ట్రస్ట్ కి 10 లక్షల విరాళం మరియు రక్తదానం..

హైదరాబాద్: జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆయన మిత్రుడు ఆయుర్ద బిల్డర్స్ అధినేత ప్రముఖ కాంట్రాక్టర్ ఎస్ వేణుగోపాల్ రెడ్డిచే ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి 10 లక్షల విరాళం మెగా అభిమానుల ఆరాధ్య దైవం పద్మభూషణ్ మెగాస్టార్ కొణిదల చిరంజీవి గారికి అందించారు. అనంతరం గునుకుల కిషోర్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగా అభిమానుల రద సారధి రవణం నాయుడు సమక్షంలో రక్తదానం చేశారు.. స్పూర్తి ప్రదాత చరిత్ర కొణిదల చిరంజీవి గారు మీ సంపాదనలో నుంచి ఈ అమౌంట్ ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడుగగా.. ఉహ తెలిసినప్పటి నుంచి స్వయంకృషితో ఎదిగి ఎంతో మందికి సాయం చేసి అవగాహన లేని రోజుల్లోనే రక్తదానం, అవయవ దానం గురించి దేశం మొత్తం మీద అవేర్నెస్ తీసుకొచ్చి, ఈ రోజు జిల్లాలో రక్తదానం జరిగే వాటిలో 70% మెగా అభిమానుల నుంచి అని గుర్తు చేస్తూ ఆ స్ఫూర్తిలో మేము సైతం భాగస్వామ్యులు అవ్వాలని చారిటబుల్ ట్రస్ట్ కి ఇవ్వడం జరిగిందని తెలిపారు.. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా సేవా కార్యక్రమానికి పరిపూర్ణంగా ఉపయోగిస్తానని చిరంజీవి గారు తెలిపారు.