100 జనసేన పార్టీ సిమెంట్ బెంచీలు

  • ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు

పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి దేశెట్టి అనంత నాయుడు జనసేన పార్టీ సిమెంట్ బెంచీలు బెల్లంకొండ మండలం, ఆర్ అండ్ ఆర్ సెంటర్ గ్రామం నందు తయారు చేయించగా, ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర మాట్లాడుతూ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరమని పార్టీ పట్ల తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేస్తూ గ్రామాల్లో జనసేన పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా అధికార ప్రతినిధి అనంత నాయుడుని అభినందిస్తున్నారని తెలియజేశారు. వారితోపాటు జిల్లా నాయకులు పెదకూరపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికార ప్రతినిధి అనంత నాయుడు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఫస్ట్ విడతగా అచ్చంపేట మండలం నందు సోమవారం నుండి ఈ బెంచ్లు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.