నందలూరులో పవన్ అన్న ప్రజా బాట 114వ రోజు

  • జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం
  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని పాటూరు పంచాయతీలో 114వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ వారి సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ కూడా లేకుండా బ్రతుకు తున్నామని ఈ ప్రభుత్వానికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. అక్కడ ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతూ రాబోవు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే స్వేచ్ఛ అభివృద్ధి మార్గంలో నడుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, గోపి, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.