గిద్దలూరులో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గిద్దలూరు: జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు ఆధ్వర్యంలో బెస్తవారపేట టౌన్ బస్ స్టాండ్ పరిదిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. కంభం మండల అధ్యక్షుడు తాడిసెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో టౌన్ లోని రామాలయం గుడి ప్రక్కన జెండా ఆవిష్కరణ ఉదయం 11 గంటలకు ఘనంగా చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ.. పార్టీ అవిర్భ దినోక్షవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం టీడీపి, బీజేపీతో కలిసి ఉమ్మదిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కావున ప్రజలందరూ కూటమి అభ్యర్ధులను అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరినారు. ముఖ్యంగా మన గిద్దలూరులో మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. బృందావనం ఫంక్షన్ హాల్ లో 2024 ఎన్నికల్లో టిడిపి, బీజేపీల నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయమే లక్ష్యంగా ఎలా కలిసి పని చేయాలి అనే దాని మీద వివిధ స్థాయి నాయకుల కలిసి చర్చించడం జరిగినది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్సులు కె బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ, బెస్తవారపేట మండల అధ్యక్షుడు ముంతల మధు సుదన్ రెడ్డి,కార్యదర్శి ఇళ్ళురి అనిల్, సంయుక్త కార్యదర్శి దూదేకుల హుస్సేన్, దుమ్మని చెన్నయ్య, వెంకట స్వామి, నారా ప్రసాద్, టీడీపి మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, పునురు భూపాల్ రెడ్డి, బీసు అరుణ్ కుమార్, కంభం మండల అధ్యక్షుడు తాడిశేట్టి ప్రసాద్, ఉదయగిరి మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి లోకేష్, టీడీపి నాయకులు నరసింహ, ఖేతం శ్రీను రాచర్ల మండల అధ్యక్షుడు అలిశెట్టి వెంకటేశ్వర్లు, ఉదయగిరి వెంకటేశ్వర్లు, అర్ధవీడు మండల అధ్యక్షుడు కలగొట్ల అల్లురయ్య, శ్రీపతి కృష్ణయ్య, బైర శేషాద్రి, వీరనాల గోపాల్, చట్టి శ్రీను, సంగతల శ్రీను, పవన్, నాగేశ్వర రావు, బండి రంగయ్య, బన్నీ, కుమార్, రాజేష్, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.