వావం గ్రామంలో 11వ రోజు జనంతో జనసేన

ఆముదాలవలస నియోజకవర్గం 11వ రోజు జనంతో జనసేన కార్యక్రమం వావం గ్రామంలో మండుటెండలో ప్రజల దీవెనలతో జరిగింది. జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఆముదాలవలస నియోజకవర్గం వావం గ్రామంలో ప్రజల సమస్యలపై మరియు పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతను చేసిన సేవాకార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి వావం గ్రామంలో సమస్యలు(ముఖ్యంగా కాలువలు సమస్య) గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీను, రమేష్, మోహన్, జగదీశ్, ప్రసాద్, జైరాం మరియు గ్రామ యువత పాల్గొన్నారు.