చైతన్య శంఖారావం 11వ రోజు

రాజమండ్రి రూరల్, చైతన్య శంఖారావ కార్యక్రమం 11వ రోజులో భాగంగా ధవలేశ్వరం కంచరలైన్ ఏరియాలో అశేష జనవాహిని నడుమ ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తమ గోడును విన్నవించుకున్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అదుపు చేయలేని విధంగా తయారయ్యారని అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ శానిటైజేషన్ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు వాపోయారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి శ్రీను, పల్లి వెంకటరమణ, పల్లి దుర్గ ప్రసాద్, జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్ప చిన్నారావు, కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, ఆటో బుజ్జి, మట్టపర్తి నాగరాజు, విజ్జిన శివ, సికోటి శివాజీ, సూరాడ సత్తిబాబు మరియు ధవళేశ్వరం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.