11వ డివిజన్ నందు జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో 11వ డివిజన్ రాజీవ్ గృహకల్ప డైరీఫార్మ్ ప్రాంతంలో జంప అప్పల రమణ ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్రని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా దళితులపై అరాచకాలు విపరీతంగా పెరిగిపొయి చంపేసి ఇంటికి శవాన్ని డోర్ డెలివరె చేసే స్థాయికి చేరాయని విమర్శించారు. సాక్ష్యాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలో సొంత పార్టీ దళిత కార్యకర్తలపైన చేసిన దాష్టీకానికి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడటం చూస్తుంటే ఇంతకన్నా యే సాక్ష్యం కావాలని అడిగారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో దళితుల ప్రాణ మానాలకు పూచికపుల్ల విలువ లేనట్టు ప్రవర్తించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తోందనీ దీన్ని ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని అన్నారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి కిశోర్ కుమార్, బొడ్డు రాజు, పెమ్మాడి కాటరాజు, కొప్పాడి నాని, కెల్లా కార్తిక్, దండుప్రోలు దుర్గాప్రసాద్, కొమ్మన సూర్యప్రకాష్ రావు, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, బండి సుజాత, దారపు శిరీష, సోనీ ఫ్లోరెన్స్, లీల, మరియ, సత్యవతి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.