ఇరిగెల బ్రదర్స్ అధ్వర్యంలో ఘనంగా 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో శిరివెళ్ళ జనసేన మండలం ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లా రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లో తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు గౌస్, పెసరాయి చాంద్ బాషా, బాబు హుస్సేన్,పసుల నరేంద్ర, ఇరిగెల ప్రతాప్ రెడ్డి,ఇరిగెల సూర్య నారాయణ రెడ్డి, ఇరిగెల విశ్వనాథ రెడ్డి,ఇరిగెల రాంచంద్రా రెడ్డి,ఇబ్రహీం ఖాన్, బండెద్దుల ఖాదర్, పెద్ద బాలయ్య, పల్లె సాగర్ తేజ, నాగరాజు శెట్టి, షబ్బీర్,మాలి,హనుమంత రెడ్డి, వంశీ, నందీశ్వర్ తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.