12వ రోజు జనచైతన్య శంఖారావం

రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం గ్రామం వాడపేట ఏరియాలో 12వ రోజు ప్రారంభమైన జనచైతన్య శంఖారావం కార్యక్రమంలో హారతులు పట్టి స్వాగతం పలికిన కాలనీవాసులు ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఈ కాలనీలో చాలావరకు రేషన్ కార్డులు గానీ, పెన్షన్ గాని ఇవ్వట్లేదని వాపోయారు. ముఖ్యంగా ఈ కాలనీలో శానిటైజేషన్ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉందని వాపోయారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నరావు, కార్యదర్శి భీర ప్రకాష్, సూరాడ సత్తిబాబు, సికోటి శివాజీ, గనగల నాని, దాసరి వెంకన్న, పోసిబాబు, కార్యదర్శి అమీనా, మేకా సత్యనారాయణ, మట్టపర్తి నాగరాజు, పోలసానిపల్లి సాయి, ధూది సాయి, శివారెడ్డి మరియు ధవళేశ్వరం గ్రామం నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.