జనసేన భీమ్ యాత్ర 12వ రోజు

కాకినాడ సిటి: జనసేన భీమ్ యాత్ర శుక్రవారం 19వ డివిజన్లోని చిన్న రామాలయం గోళీల వీధి దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహం సమీప ప్రాంతంలో వీరమహిళ బట్టు లీల ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక దళితులని చైతన్యపరుస్తూ, మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వం నొరు విప్పితే నవరత్నాలు అంటూ అదేదో గొప్ప అద్భుతం లాగా కోతలు కోస్తున్నారనీ, అదే నిజమైతే మరి పేదలు, దళితుల జీవితాలలో మార్పు వచ్చిందని నిరూపించగలరా అని చాలెంజ్ చేసారు. పేదలకి సంపాదన నేర్పితే తమ చేతినుండీ జారిపోతారని భావిస్తూ కేవలం చిల్లర విదిలుస్తూ తమ పబ్బం గడుపుకునే విధంగా ఈ ముఖ్యమంత్రి భావిస్తున్నారనీ దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, శివాజీ యాదవ్, మండపాక దుర్గాప్రసాద్, చీకట్ల వాసు, చిన్నా, బండి సుజాత, బట్టు లీల, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి, మిరియాల హైమావతి తదితరులు పాల్గొన్నారు.