డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయం 135వ వారం

జనసేన అధినేత & ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు, ప్రజాసేవ స్ఫూర్తితో నాటి జిల్లా జనసేన అధ్యక్షులు & నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి & సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు & జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము జ్యోతుల శ్రీనివాసు నేటికి ఏర్పాటు చేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతుల అన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు. శనివారం ఉచిత అన్నపానీయ సదుపాయంను రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చిన ఔట్ పేషెంట్లకు కలిపి 700 మందికి కల్పించారు. వడ్డన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పిఠాపురం నగరజనసేన నాయకులు అల్లం కిషోర్, సఖినాల లచ్చబాబు, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను తదితరులు ఇతర రైతులు ఆహరపానీయ వడ్డనలో పాల్గొని రైతులకు తమ సేవలను అందించించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్ లకు భోజన వసతి కల్పిస్తున్న మాతృసంస్థ అయిన సాయిప్రియ సేవాసమితికి 135వ వారం కూడా స్వచ్చందంగా ఉచితంగా సేవలు అందిస్తున్న వారిని సాయిప్రియ సేవాసమితి వ్యవస్దాపక అధ్యక్షులు & జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు చరవాణి ద్వారా అభినందించారు.

Share this content:

Post Comment