రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి

  • పవన్ అన్న ప్రజా బాట 136వ రోజు
  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లి మండలం మాచి రెడ్డి గారి పంచాయతీ లోని పలు గ్రామాలలో కటారమడుగు, నల్లగుట్లపల్లి, మిట్టబిడికి, ఐలోలపల్లి, మిట్టబిడికి కాలనీ, పెద్ద బిడికి, చిన్నబిడికి, మాచి రెడ్డి గారి పల్లె, వాయల ఒడ్డులలో 136వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లె వీర మహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, జనసేన వీర మహిళలు సుగుణమ్మ, లక్ష్మమ్ తదితరులు పాల్గొన్నారు.