పిఠాపురం, జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు, ప్రజాసేవ స్పూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షుడు మరియు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభించిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం కార్యక్రమం పిఠాపురంలో ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి మరియు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు ఉచితంగా అన్నపానీయ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. శనివారం 650 మందికి ఉచితంగా అన్నపానీయ సేవలు అందించారు. ఇందులో రైతులు, పశువుల బేరాల మధ్యవర్తులు, వివిధ హాస్పిటల్స్ కు వచ్చిన ఔట్ పేషెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అయిన అల్లంకిషోర్, జ్యోతుల సీతరాంబాబు, నురుకుర్తి చంద్రశేఖర్, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను తదితరులు ఆహారపానీయ వడ్డనలో పాల్గొని రైతులకు తమ సేవలను అందించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రం ద్వారా శ్రమశక్తి ద్వారా రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, పేషెంట్లకు భోజన వసతి అందిస్తున్న సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు చరవాణి ద్వారా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం సామాజిక సేవకు అంకితమైన విధంగా సాగిన పద్ధతులలో, సాయిప్రియ సేవాసమితి 136వ వారం కూడా స్వచ్ఛందంగా సేవలు అందించింది.

Share this content:
Post Comment