14 కి.మీ నడిచా: సన్నీలియోన్

కారు లేనిదే సెలబ్రిటీలు కాలు కూడా బయట అడుగు పెట్టరు అలాంటిది మన హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కొండ ప్రాంతంలో 14 కి.మీలు నడిచి అందరిని షాక్ కు గురి చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో కలర్ టీ షర్ట్‌- బ్లాక్ షార్ట్ ధరించిన ఫోటో షేర్ చేస్తూ.. కొండల మధ్య 14 కి.మీ నడిచానంటూ కామెంట్ పెట్టింది. సన్నీ అంత దూరం నడిచింది అనే సరికి నెటిజన్స్ షాక్ అవ్వడమే కాకుండా ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమె షేర్ చేసిన ఫోటోకి 1 మిలియన్‌కి పైగా లైక్స్ వచ్చాయి.

లాక్‌డౌన్ సమయంలో ఫ్యామిలీతో కలిసి లాస్ ఏంజిల్స్ వెళ్లిన సన్నీ లియాన్ ప్రస్తుతం అక్కడే ఉంది. షూటింగ్స్ లేకపోవడంతో కుటుంబంతో ఆనంద క్షణాలు గడుపుతుంది. బీచ్‌లకు వెళ్లడం, గార్డెన్ ఏరియాలలో సందడి చేయడం వంటివి చేస్తున్న సన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఫ్యాన్స్‌కి థ్రిల్ ఇస్తుంది.