14, 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలి

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండల నాయకులు పలు గ్రామాలలో పర్యటనచేస్తూ గ్రామ సమస్యలను తెలుసుకొని 14, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జి.మాడుగుల మండల జనసేన పార్టీ నాయకులు ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పంచాయతీ నిధులను ప్రభుత్వం దారి మళ్ళించడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీలలోని పలు గ్రామాలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ మౌలిక సదుపాయాలు లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, వీధి దీపాలు గాని అందించడంలో పంచాయతీ వ్యవస్థ విఫలమయింది. దీనికి ప్రధాన కారణం పంచాయితీకి రావాల్సిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించడమే దీనికి గలా ప్రధాన కారణం. ఈ విషయం గిరిజన ప్రజాప్రతినిధులు శిత్తశుద్దితో గిరిజన ప్రాంతం అభివృద్ధి కొరకు ఆలోచన చేసి ప్రభుత్వానికి అడిగితే ఫలితం ఉంతుందని అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదని కానీ అడగాలంటే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు బయపడుతున్నారో అర్థం కావట్లేదని సహజంగా భయపడే నాయకత్వాన్ని బానిస విధానంగా ఈ తరం గిరిజన యువత భావిస్తోంది అన్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ గ్రామాలలో లేకపోవడం వలన వర్షపు నీరు గ్రామాల మధ్య నిలువ ఉండి మురుగు కాలువలుగా ఏర్పడి విపరీతమైన దోమల బెడద కలగడానికి కారణమయ్యాయి దీనివల్ల అనేకమంది రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి పంచాయతీకి రావలసిన నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేసి గ్రామాభివృద్ధికి చేపట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జి మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న కార్యనిర్వహక కమిటీ సభ్యులు తాంగుల రమేష్, పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నాగేష్, మండల నాయకులు కొర్ర భాను ప్రసాద్, తల్లె త్రిమూర్తులు, మల్లేష్, బి. జానీ, బి.బాలన్న పాల్గొన్నారు.