రాజానగరం నియోజకవర్గం నుండి నా సేన కోసం నా వంతుకు 15 లక్షల 62 వేల విరాళం

  • ఫోన్ పే, గూగుల్ పే(యు.పి.ఐ ట్రాన్సాక్షన్స్) ద్వారా 12 లక్షల 50 వేలు
  • చెక్కుల రూపంలో 3.12 లక్షల

రాజానగరం నియోజకవర్గం, జనసేన పార్టీకి రాజానగరం నియోజకవర్గం నుంచి ఫోన్ పే, గూగుల్ పే(యుపిఐ ట్రాన్సాక్షన్స్) ద్వారా 12 లక్షల 50 వేలు, చెక్కుల రూపంలో 3.12 లక్షల భారీ విరాళం రావడం జరిగింది. నా సేన కోసం నా వంతు కార్యక్రమం కోసం నియమించిన కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ పటిష్టత కోసం ప్రజలు స్వచ్ఛదంగా భాగస్వామ్యం అవుతూ, పార్టీ చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న విధానం పార్టీకి కొండంత బలంగా రూపుదిద్దుకుంటోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి 12 లక్షల 50 వేలు యుపిఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా, 3.12 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో భారీ విరాళాలను సేకరించిన రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిలను ఈ సందర్భంగా నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీకి విరాళాలను అందించిన జనసేన నాయకులకి, జనసైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మున్ముందు ఈ కార్యక్రమం నిర్వాహణకు అవసరమైన సూచనలు స్వీకరిస్తూ.. కమిటీ బాధ్యతలను విస్తరించే అంశాల గురించి చర్చించారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణపట్నం గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరాం 1,00,000/- రూపాయలు, పాలచర్ల జనసేన నాయకులు సూరపురెడ్డి రాజారావు 50,000/- రూపాయలు, గంగిశెట్టి రాజేంద్ర 20,000/- రూపాయలు విరాళాలుగా చెక్కుల రూపంలో అందించగా.. నియోజకవర్గ స్ధాయిలో 10 రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకూ సుమారు రెండు వేల ఆరువందల మంది(2,600) చెక్కుల రూపంలో మరియు ఊఫీస్ ద్వారా విరాళాలను అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలో జరిగిన నా సేన కోసం నా వంతు కార్యక్రమాల ద్వారా విరాళాలను అందించిన ప్రతి ఒక్క జనసేన నాయకులకు, జనసైనికులకు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.