ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 16వ రోజు పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గం, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా 16వ రోజు స్థానిక శనివారపు పేటలోని 25 డివిజనలలో దేవాంగుల పేట, ఇందిరా నగర్ కాలనీలో మండల ఉపాధ్యక్షుడు సుందరనీడి వెంకట దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి చేరువలో ఉన్న దేవాంగుల పేటలో సుమారు అర కిలోమీటరు మేర రోడ్డు మురుగు నీరు ప్రవహించి కుళ్ళు పేరుకుపోయి దుర్వాసన మరియు దోమలు విపరీతంగా ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, ఎన్నికైన కార్పోరేటర్ ఎవ్వరూ కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. 20 రోజుల్లో కనుక మీరు ఈ సమస్యని పరిష్కరించాలని లేని పక్షాన జనసేన పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందని రెడ్డి అప్పల నాయడు హెచ్చరించారు. అలాగే ఇందిరా కాలనీ లోని బయ్యారపు వారి పేటలో ఉన్న ఆర్.సి.ఎమ్. చర్చ్ దగ్గర మురికి నీరు రోడ్డు మీద ప్రవహిస్తున్నట్టు వంటి పరిస్థితి. ఈ నీటిని తాగుతూ రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము. తక్షణమే మురుగు డ్రైన్ ని శుభ్రపరిచి ప్రజల ప్రాణాన్ని రక్షించాలని లేని పక్షంలో జనసేన పార్టీ తరపున భవిష్యత్తులో తీవ్రంగా పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులో ప్రజలు ఖచ్చితంగా బుధ్ధి చెపుతారని ప్రజలు పవన్ కళ్యాణ్ ని నమ్ముతున్నారని జనసేన పార్టీకి మద్దతుగా పలుకుతున్నారని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, నగర అధికార ప్రతినిధి కూనిశెట్టి మురళి, బొత్స మధు, అల్లు చరణ్ మరియు స్థానిక నాయకులు కొనికి మహేష్, వాసా సాయి, దారుగ చంద్ర, బత్తుల రాంబాబు, గెడ్డం చైతన్య, తోట దుర్గా ప్రసాద్, సుందరనీడి శివ శంకర్, తోట రాజేష్, ఆదిల్, చీమల నాగరాజు, జవ్వాది నరేష్, సగరం సాగర్, మామిళ్ళపల్లి అనిల్, యర్రంశెట్టి నందగోపాల్, అల్లాడ రవి, జవ్వాది కృష్ణ, పేరిశెట్టి నాగేశ్వరరావు, నారాయణ కాళిదాసు, చీమల రవి, మావుళ్ళ ధర్మ యాదవ్, యర్రంశెట్టి ఆంజనేయులు, కెంగువ సూరి మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు కావూరి వాణి, లంకా ప్రభావతి, తుమ్మపాల ఉమాదుర్గ, సరళ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.