సర్వేపల్లిలో జనం కోసం జనసేన 19వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం, గురివిందపూడి పంచాయతీలో మంగళవారం జనం కోసం జనసేన 19వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గురివిందపూడి పంచాయతీలోని నేషనల్ హైవేకి అనుకొని ఉన్న 70 కుటుంబాల ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో కొన్నిచోట్ల పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అనే కొటేషన్తో ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో పేదలు ఎవరు..?, పెత్తం దారులు ఎవరు..? గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ. లక్ష కోట్లు అవినీతికి పాల్పడిన వ్యక్తి పేదవాడా?. దేశంలో తొమ్మిది ప్రాంతాలలో భారీ ప్యాలెస్లు కలిగిన వ్యక్తి పేదవాడా. దేశంలో రూ. లక్ష కోట్లు అవినీతి చేసిన ముఖ్యమంత్రిలలో మొదట వ్యక్తి ఎవరు అని అంటే మొదటి వరుసలో ఉండే వ్యక్తి పేదవాడా?. ఎవరు పేదవాడు పాపం ఈ పసివాడు పేదవాడా. పాపం పసివాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు దాటితే ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి. కొండలని కూడా వదలకుండా రూ.కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియాకి పాల్పడిన పాపం పసివాడు చాలా పేదవాడు. ప్రజలు పాపం పసివాడిని బయట ఉంచితే ఇబ్బంది కాబట్టి త్వరలోనే లోపలికి పంపిస్తారు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటోని అందులో ప్రచురించి ఫ్లెక్సీలు వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ముగింపు దశ. ఈ ఫ్లెక్సీలను తొలగించకపోతే జనసేన పార్టీ ఉవ్వెత్తిన ఎగిసిపడుతుంది. పాపం పసివాడు మాత్రం గుహలోకి పోయే రోజులు దగ్గరలోనే ఉండాయి. ఈ కార్యక్రమంలో పిన్నిశెట్టి మల్లికార్జున్, ఆస్తోటి రవికుమార్, రామిరెడ్డి, శ్రీహరి, సందీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.