ఆక్రమణలు తొలగింపునకు 20 లక్షలు అవసరమా: కౌన్సిలర్ గండి దేవి హారిక

అమలాపురం పురపాలక సంఘ సమావేశం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి అధ్యక్షతనజరిగింది. ఈ సమావేశంలో అమలాపురం పట్టణ పరిధిలో ఆక్రమణలు తొలగించడంలో 20లక్షలు ఎందుకు, సగం కూడా ఖర్చు కాని వాటికీ అని 7వ వార్డు జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక ప్రశ్నించారు. ముందు అవగాహన అవసరం అని అధికార వై.సి.పీ కౌన్సిలర్ 17వ వార్డు దొమ్మేటి పరశురాముడు (రాము) అన డంతో ఆయనకు వైసీపీ కౌన్సిలర్లు అండగా నిలిచారు. జనసేన కౌన్సిలర్ 7వ వార్డు గండి హారిక దేవి కి మద్దతుగా సీనియర్ కౌన్సిలర్, 6వ వార్డ్ జనసేన కౌన్సిలర్ పిండి అమరావతి నిలిచారు. దీనిపై అబ్బిరెడ్డి వెంకటనాగేశ్వరావు(చంటి) 21వ వార్డు తెలుగుదేశం కౌన్సిలర్ మాట్లాడుతూ కౌన్సిలర్ అడిగిన వాటికి సమాధానం ఇవ్వండి, ఆమెకు తెలియదు అంటూ మాట్లాడం తగదు అన్నారు. అభ్యంతరం పెడుతున్నా ఆమోదం అంటూ ముందుకు పోతున్నారు ఇలా ఐతే ఎలా అని 6వ వార్డు జనసేన కౌన్సిలర్ పిండి అమరావతి ప్రశ్నించారు. చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణికి జనసేన కౌన్సిలర్లు 7వ వార్డు గండిదేవి హారిక, 6వవార్డు పిండి అమరావతి డీసెంట్ ఇచ్చారు. దీనిపై వైసిపి కౌన్సిలర్17వ వార్డు దొమ్మేటి పరశురాముడు(రాము) గతంలో ఆమోదం చేసిన పనులకు డీసెంట్ అంటూ వివాదం చేయడం సరి కాదు అన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-28-at-8.06.57-PM-1024x576.jpeg