సర్వేపల్లిలో జనం కోసం జనసేన 20వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు మండలం, దేవరదిబ్బ నందు అదివారం జనం కోసం జనసేన 20వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. ముత్తుకూరు మండలంలో ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, ఇంకొక వైపు పవర్ ప్లాంట్ లు పొల్యూషన్ తో నిండిపోయింది. ముత్తుకూరు మండలం అయితే దేవరదెబ్బ ఇక్కడ 300 గిరిజన కుటుంబాలు వున్నాయి. చుట్టుపక్కల కాలువలో చేపలు పట్టుకుని జీవనాధారం కొనసాగించేవారు. పవర్ ప్లాంట్లు ఏర్పడిన తర్వాత ఆ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిద పైప్ లైన్ ల ద్వారా యాష్ నిర్మాణం చేసి అక్కడికి పంపింగ్ చేయడం జరుగుతుంది. యాష్ పాండ్లు దేవర దిబ్బకి ఎగువను ఉండటంతో గాలి తోలినప్పుడు ఆ బుడిదంతా కూడా వాళ్ళ ఇళ్ల పైన వాళ్ళ తినే అన్నంలో తాగే నీరు లో కలుషితమవడం, అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది. యాష్ పాండ్ నిర్మించేటప్పుడు వీళ్ళందరికీ కూడా వేరే దగ్గర ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని, జీవనాదారం కల్పిస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు వాళ్లకి ఏ విధమైనటువంటి ఇల్లు నిర్మించడం గానీ, జీవనాధారాన్ని కల్పించడం గానీ జరిగిన పరిస్థితులు లేవు. ప్రభుత్వాలు, పాలకులు వస్తున్నారు, పోతున్నారు తప్ప వీళ్ళ సమస్య పూర్తిగా పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా నాయకులు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారే గానీ వీళ్ళ సమస్యగానీ ఉండి ఎన్నో అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గానీ, జిల్లా కలెక్టర్ గారు గానీ ఇక నైనా స్పందించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తు కురు మండల సీనియర్ నాయకులు రహీమ్, అశోక్, వంశి, గణేష్, మల్లి, శ్రీ హరి, వంశీ, తదితరుల పాల్గొన్నారు.