సర్వేపల్లిలో జనం కోసం జనసేన 23వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: ముత్తుకూరు మండలం, పంటపాలెం నందు మంగళవారం జనం కోసం జనసేన 23వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. పంటపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆయిల్ కంపెనీలకి అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయలు విలువచేసే భూగర్భ జలాలను అక్రమంగా తరలింపు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాబోయే రోజులలో తాగునీరు, సాగునీరుకు పజలు అవస్థలు పడేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నమ్. ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం. భూగర్భ జలాలను తరలించటం ఆపండి అనే విషయాన్ని ఇప్పటివరకు ఎవరూ కూడా దానిపైన స్పందించిన పరిస్థితులు లేవు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరే ఉన్నాయి. పంచాయతీలలో అభివృద్ధి లేదు. పంచాయతీలో నిధులు లేవు మరి ఏమి అభివృద్ధి చేశారు. నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను ఇస్తే వీళ్ళు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా మళ్లీ ఎన్నికలలో గెలుస్తామో లేదో అనే అందచందంగా అక్రమాలకి పాల్పడుతున్నారు తప్ప రాష్ట్రాన్ని గాని, నియోజకవర్గాలను గాని, జిల్లాలను గాని, గ్రామాలను గాని ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. వీళ్ళకి 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు.
అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖాతాని గోవర్ధన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో మా అధినేత రెండు చోట్ల ఓడిపోయాడు. మరి ఆయన మాట్లాడే మాటలకి ప్రజలే నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని వ్యక్తపరిచారు. అయ్యా గోవర్ధన్ రెడ్డి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శవ రాజకీయాలు చేయలేదు. హత్య రాజకీయాలు చేయలేదు. రు.కోట్ల రూపాయలు అవినీతి చేయలేదు 17 నెలల పాటు జైల్లో ఉండలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోలేదు మా అధినేతకి ఎక్కడా కూడా కోట్ల రూపాయలు విలువచేసే భవనాలు లేవు సిమెంట్ ఫ్యాక్టరీ లేవు పేపర్ లేవు సొంత మీడియా లేదు కాబట్టి ఆయన ఓడిపోయినంత మాత్రాన ఆగిపోలేదు. రేపు పొద్దున మీరు ఓడిపోతే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి సార్. మేము ఎన్నికల సమయంలో పిచ్చి మందు పంచి ప్రజల ప్రాణాలతో చెలగాటం అనలేదు గుర్తుపెట్టుకోండి 2024లో మీ ఓటమి ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, వాసు, సుమంత్, శ్రీహరి, కోటిరెడ్డి, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.