నరవ జనసేన ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష

పెందుర్తి: స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ నరవ గ్రామంలో కళ్యాణ మండపం బడుగు బలహీన వర్గాల ప్రజల శుభకార్యాలకు, పుట్టినరోజులకు వివాహ మహోత్సవములకు, దిన కార్యాలకు, డ్వాక్రా మహిళా శిక్షణ తరగతులకు, మీటింగ్ లకు ఎంతో ఉపయోగంగా ఉండేది, 3 సంవత్సరాల క్రితం నరవ సచివాలయం అద్దె బిల్డింగ్ లో పెట్టడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే కళ్యాణమండపంలో కి సచివాలయాన్ని పెట్టారు. ఆనాడు జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాం. అప్పుడు స్థానిక నాయకులు మేము మీకు 6 నెలలలో కళ్యాణమండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం ఈ సచివాలయాన్ని వేరే ప్రదేశంలో మారుస్తామని బదులిచ్చారు. 6 నెలలు గడిచిన తర్వాత పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టి కి తీసికొని వచ్చినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. వారి వైఖరికి నిరసనగా పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 24 గంటల నిరాహార దీక్ష చేయడానికి మొదలుపెట్టాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి ఈ కళ్యాణ మండపం ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి తగు చర్యలు చేయాలని, ప్రభుత్వ పెద్దల దృష్టికి మీడియా వారు కూడా తీసుకొని వెళ్లి మాకు సహకరించాలని కోరడం జరిగింది.స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల నుంచి పనులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు మ ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి లేదు అని, ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న వారి పరిష్కార మార్గం జనసేన పార్టీ గెలుపు మాత్రమే అని, ప్రజలందరూ జనసేన పార్టీ వైపు నిలబడితే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ సమస్య లేకుండా పరిపాలన జరుపుతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంజరిగింది.ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు గండ్రెడ్డి చిన్నారావు, మోటురు చైతన్య, గవర శ్రీను ప్రవీణ్, నాయుడు, శివ, గవర నానాజీ, నవీన్, రవి బాబు, గవర పరమేశు, రాడి తేజ, గిరి, వీర మహిళలు మీనాక్షి, జయ మరియు జనసైనికులు పాల్గొన్నారు.