సర్వేపల్లిలో జనం కోసం జనసేన 25వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: పొదలకూరు మండలం, మరుపూరు నందు జనం కోసం జనసేన 25వ రోజు కార్యక్రమాన్ని శనివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అమ్మ ఒడి సభలో మాట్లాడవలసింది గత సంవత్సరం ఎంతమందికి అమ్మవడి ఇచ్చాం. మరి ఈ సంవత్సరం ఎంత మందికి ఇస్తున్నాం. పిల్లలు ఎలా చదువుకోవాలి అనేటువంటి విషయాలు మీద మాట్లాడాల్సింది పోయి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్ల గురించి యువత చిన్న పిల్లలు చదువుకునే యువతకి మూడు పెళ్లిళ్లు గురించి చెప్పి మాట్లాడే అంత అవసరమేమైనా ఉందా. ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు నేర్చుకోవాలి, రెండోది హిందీ నేర్చుకోవాలి, మూడోది ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, నాలుగోది పూర్తిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ముందు సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆయనకు రాకపోతే వయోజన విద్య కింద జనసేన పార్టీ ఆయనకి ఎలా మాట్లాడాలో నేర్పించడానికి మేమంతా సిద్ధం. ఆయనతోపాటు ఆయన 151 యొక్క మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 22 మంది ఎంపీలకు కూడా వయోజన విద్య కింద మేము ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో నేర్పించడానికి జనసేన పార్టీ సిద్దమే. అదే విధంగా రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయలేకపోవడం పవన్ కళ్యాణ్ గారు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే నా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, పెరిగిన కరెంటు చార్జీలు కావచ్చు, పెరిగిన బస్సు చార్జీలు కావచ్చు, పెరిగిన పెట్రోల్ డీజిల్ కావచ్చు, పెరిగిన గ్యాస్ కావచ్చు, పెరిగిన నిత్యవసరాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు చేసుకోవడమేనా.? ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారు. మీరేం చేయలేదో మీరేం చేయాలో అనేటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రస్తావిస్తున్నాం తప్ప మీ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో మీ తాతలు, తండ్రులు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. మీ సోదరులు, సోదరీలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని మేము ఏక్కడ కూడా వ్యక్తపరచలేదు. కాబట్టి మీరు ముందు మాట్లాడటం నేర్చుకోండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడడం నేర్చుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో స్థానికులు సంజూ, ప్రవీణ్, జయంత్, విష్ణు, గోవర్థన్, కుమార్, వంశి, జాన్, కల్యాణ్, కార్తీక్, రియాజ్, పెంచలయ్య, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.