బిజినపల్లికి చేరుకున్న వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 25వ రోజు కార్యక్రమం
  • రెండవ విడతగా బిజినపల్లి మండలం నేటితో పూర్తి …
  • పాలకులను వ్యతికేరిస్తున్న మండలంలోని గ్రామాల ప్రజలు

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నిరంతరాయంగా 25 రోజులుగా కొనసాగుతున్న పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమం బిజినపల్లికి చేరుకుంది. వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధర్యంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమానికి మొదటి విడత తెల్కపల్లి మండలంలో, బిజినపల్లీ మండలంలో అపూర్వ ఆదరణ పొందడం హర్షణీయం.. బుధవారం బిజినపల్లి టౌన్ లో వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం నిర్వహించి, టౌన్ లో పాదయాత్రగా పర్యటించారు.. బిజినపల్లి ప్రజల ప్రధాన సమస్యలు ఇల్లు లేని వాళ్ళకి రెండు పడక గదులు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, 3 ఎకరాల భూమి, దళిత బంధు అంటూ అధికారంలోకి వచ్చారు.. 8 సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఇత్తడి తెలంగాణకు గతి లేదు…. ఉండటానికి గుడు లేదు, పూరి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నాం.. ఎలక్షన్స్ సమయంలో మా ఓటు కోసం పాకులాడే పాలకులకు మా బాధలు కనిపించవు అంటూ గ్రామస్థులు వారి సమస్యలు లక్ష్మణ్ గౌడ్ కు తెలియజేసారు. మొదటి విడత తెల్కపల్లి మండలం, రెండవ విడతగా బిజినపల్లి మండలాల్లో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో
నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు హారి నాయక్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, బాలకృష్ణ, బాలు, తమ్మేడి పవన్, నరేష్, ఎజ్జు ఆంజనేయులు, లింగం నాయక్, మురళి, జోగు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.