కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవన్ అన్న ప్రజా బాట 27వరోజు

విశాఖ, దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32వ కార్పొరేటర్, డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవన్ అన్న ప్రజా బాట 27వరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికలలో గాజుగ్లాసుకు ఓటు వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.