దసరాకు 3 వేల ప్రత్యేక బస్సులు!

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 3000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. జంట నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ విషయాన్ని రంగారెడ్డి ఆర్ఎం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (MGBS), జూబ్లీ బస్‌స్టేషన్ (JBS), కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట్, ECIL, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు వెళ్తాయని ఆయన తెలిపారు. ఈ బస్సుల్లో ప్రయాణం కోసం ప్రజలకు అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించినట్లు రంగారెడ్డి ఆర్ఎం చెప్పారు.