30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ఓపెనింగ్స్..?

యాంకర్ గా బుల్లితెర ఫై సందడి చేస్తూ వస్తున్న ప్రదీప్ మాచిరాజు.. ఇప్పుడు వెండితెర ఫై హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం లో ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటించగా.. అనూప్ రూబెన్స్ అందించిన పాటలుశ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. అయినప్పటికీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీగా వచ్చినట్లు చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఓవర్‌సీస్, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లోనూ మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలైన అన్ని థియేటర్స్ ఫుల్ అవడం చాలా హ్యాపీగా ఉందని ప్రదీప్ అన్నారు.