ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 32వ రోజు పాదయాత్ర..

ఏలూరు: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా ఆదివారం స్థానిక 13వ డివిజన్ లోని క్రీస్తు రాజపురం ఎస్సీ ఇందిరా కాలనీ, వెంకన్న చెరువు ప్రాంతాల్లో పాదయాత్రను జననీరాజనాల నడుమ నిర్వహించిన రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆదివారం 13 డివిజన్ లోని కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, పెద్దలు, వీర మహిళ సోదరీమణులు, టౌన్ నాయకులు నగర నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏరియాలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది.. గతంలో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మాత్రమే మున్సిపాలిటీ నుండి వాటర్ ఇవ్వడం జరిగింది..ఈ రోజున ఆ వాటర్ సరఫరా సక్రమంగా లేదు.. ఇక్కడ ప్రజలు ఈ సమస్యల గురించి వివరిస్తున్నారు.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చాయని కుంటి సాకుతో పెన్షన్లు తొలగిస్తున్నారని ఇక్కడున్న ప్రజలు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.. అలాగే సచివాలయ పరిధిలో డబ్బులు ఇస్తున్నామని ప్రభుత్వ అట్టహాసంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ సమస్య , మంచినీటి సదుపాయం లేదు..లైట్లు వెలిగే పరిస్థితి లేదు.. ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి మాత్రమే ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామని, తద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు..ప్రజా పక్షాన ప్రజా గొంతుకై స్థానిక నాయకులు పనిచేస్తున్నారన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన పరిస్థితి లేదు…కక్ష సాధింపు చర్యలు, కేసులు ,దౌర్జన్యాలు తప్పించి అభివృద్ధి ఎక్కడ లేదు..నిరుద్యోగులు పెరిగిపోతున్నారు..ఎక్కడ ఉపాధి కల్పనా లేదు..రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉందని అన్నారు. స్థానిక శాసనసభ్యులు గా గెలిచిన ఆళ్ళ నాని గారు మొద్దు నిద్ర వీడి నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఏలూరు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. మీరు చేసిన అభివృద్ధి శూన్యం అని ఇప్పటికైనా మీరు స్పందించి ఈ రోడ్లు డ్రైనేజీలు మరమ్మత్తులు చేయించవలసిందిగా ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, చిత్తరి శివ, కోలా శివ, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సోషల్ సర్వీస్ మురళి, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, బొద్దపు గోవిందు, కత్తిరాజు, పొన్నూరు రాము,మజ్జి శ్రీను, స్థానిక నాయకులు తోట రవి, తోట రాజేష్, ఉమామహేష్, విష్ణు, అంజి, సత్యనారాయణ, ప్రసాద్, పోలవరపు చిరంజీవి, షేక్ సాబ్జీ, జె.రాజేష్, పి.వెంకట్, జోజివీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమాదుర్గ, సుజాత, సరళ తదితరులు పాల్గొన్నారు.