కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సోమవారం గోదావరి భవన్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “మీ కోసం” కార్యక్రమంలో, 335 అర్జీలు స్వీకరించి, వాటిపై సంబంధిత అధికారులను సకాలంలో నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని, అర్జీదారులలో నమ్మకం పెంపొందించేందుకు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రీఓపెన్‌కు అవకాశం లేకుండా తగు పరిష్కారం చూపాలని సూచించారు. గడువు దాటిన అర్జీలు లేకుండా ప్రతి అధికారిక స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలని, మండల స్థాయి సమస్యలు మండలంలోనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు విని, తగు పరిష్కారాలు చూపించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఇ కృష్ణారెడ్డి పంచాయతీ రాజ్ ఎస్.ఈ రామకృ ష్ణారెడ్డి, డి సి హెచ్ ఎస్ కార్తీక్, డి ఎం అండ్ హెచ్ ఓ, దుర్గారావు దొర, మత్స్యశాఖ జేడీ ఎన్ శ్రీనివాసరావు, డిఐపి ఆర్ఓ కె లక్ష్మీనారాయణ, ట్రాన్స్కో ఎస్.ఈ ఎస్ రాజబాబు వివిధ శాఖల కు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment