ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 33వ రోజు పాదయాత్ర

ఏలూరు నియోజకవర్గాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లి సమస్యల నిలయంగా మార్చి వేశారని రెడ్డి అప్పలనాయుడు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళనానిపై మండిపడ్డారు. 33వ రోజు పాదయాత్రలో భాగంగా గురువారం 6వ డివిజన్ లోని శివ కామాక్షి కాలనీ, ఆళ్ళనాని కాలనీలో ఆయన పర్యటిస్తూ ప్రజలు పడుతున్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ గతంలో మేము సర్పంచిగా, ఎంపీపీగా ఉన్నప్పుడు రోడ్లను వేయడం జరిగిందని తరువాత రోడ్లు గాని డ్రైనేజీలు గాని వేసిన దాఖలాలు లేవని అన్నారు. 200 రూపాయల దగ్గర నుండి మాకు పెన్షన్లు వచ్చేదని కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెన్షన్లను తొలగించారు. ఎన్నిసార్లు అప్లై చేసిన 200 యూనిట్లు వంక చెప్పి మా పెన్షన్లను పీకి వేస్తున్నారని, ఇంకొక ఆవిడ నా భర్తకు పెన్షన్ వచ్చేది. భర్త చనిపోయి నాలుగు సంవత్సరాలయింది కానీ ఈ రోజుకు నాకు పెన్షన్లు రాలేదని నాకు ఏ ఆధారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ డివిజన్ లో చూసిన డ్రైనేజీ సరఫరా లేదు. మంచినీటి సదుపాయం లేదు. ఏ నాయకుడిని అడగాలో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. మొన్ననే ఎంఆర్సి కాలనీలో చూస్తే ఒకాయన చనిపోతే తంగెళ్ళమూడి స్మశానానికి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్లు 10,000 డిమాండ్ చేశారు. తరువాత 6000 రూపాయలు కి బేరమాడారు. అంటే కార్పొరేషన్ 5000 నిర్ణయించింది కదా మీరు ఆరు వేల రూపాయలు చెల్లించడానికి ఏంటని అడుగుతున్నారు. ఇలా అయితే మేము సంస్కారాలు చేయనివ్వము అంటున్నారు. ఏలూరుని అట్టడుగు కి తోసి వేశారు. సమస్యల మయంలో పడేశారు. వృధ్ధులు, వికలాంగులు,వితంతువుల పెన్షన్లను కూడా పీకి వేస్తున్నారని ఇలా ఐతే వాళ్లు ఎలా బతుకుతారని ప్రశ్నించారు?. ఏలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పెళ్లి సంబరాలు మునిగితేలుతున్నారని మండి పడ్డారు. వైసీపీ అధిష్టానం మిమ్మల్ని గడపగడపకు మన ప్రభుత్వమని తిరిగమని పంపితే మా ఎమ్మెల్యే ఆళ్ళనాని గారు పెళ్లి పందిళ్లు ఏర్పాటు చేసుకొని మునిగితేలుతున్నారని విమర్శించారు.ప్రజలు బాధల్లో ఉంటే మీరు ఈ విధంగా సంబరాలు చేసుకోవడం సబబేనా అని ప్రశ్నించారు?. ఆళ్ల నాని కాలనీలో సరైన వసతులు లేవు. ఏలూరు ప్రజలు చెబుతూనే ఉన్నారు ఆళ్ళనాని గారు మా డివిజన్ కు వస్తే చొక్కా పట్టుకొని నిలదీస్తామని. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మీరు గాని మీ యొక్క ప్రభుత్వం గానీ ప్రజల బాధలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే విధంగా ఉండాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మలజ్యోతి కుమార్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు నగి రెడ్డి కాశి నరేష్, ఉపాధ్యక్షులు సుందరనీడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, సరళ, బొత్స మధు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, చిత్తరి శివ, కోలా శివ నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసరావు, గుబ్బల నాగేశ్వరరావు, వేముల బాలు, గెడ్డం చైతన్య, బొద్ధాపు గోవిందు, బలరాం, చీమల గోపి, మజ్జి శ్రీనివాసరావు, సురేష్ వీరమహిళలు కోలా సుజాత, తుమ్మపాల ఉమాదుర్గ, పండు ప్రియారాని, దుర్గా బి తదితరులు పాల్గొన్నారు.