ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 36వ రోజు పాదయాత్ర

  • సమస్యలతో మారు మ్రోగిన 18వ డివిజన్
  • పరిష్కారానికి పోరాటం చేస్తానన్న ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 36వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఏలూరు నగరపాలక సంస్థ 18వ డివిజన్ వంగాయగూడెం లోని అంబేద్కర్ బొమ్మ దగ్గర నుండి గొల్లాయగూడం మీదుగా జనసేన పోరుబాట కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలనాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అనేక కుటుంబాలు తమకు పెన్షన్ తీసివేసారని, కరెంటు చార్జీలు అధికంగా వస్తున్నాయని, నీటి సమస్య తీవ్రంగా ఉందని, త్రాగునీరు కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మహిళలు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. డివిజన్ పరిధిలో గొల్లాయగూడెం కాలనీ ఆక్రమణలతో నిండిపోయాయని, రోడ్లు డ్రైనేజీ సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, నగరపాలక సంస్థకు కొత్త పన్ను కడుతున్న ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోందని, పారిశుద్ధ్య వాహనాలు రెండు రోజులకు ఒకసారి దర్శనమిస్తున్నాయని డ్రైనేజీలలో మురుగు తొలగించకపోవడంతో మురుగుపారక దుర్వాసన వెదజల్లుతోందని, డ్రైనేజీలో రసాయనాలు వెదజల్లకపోవడంతో విపరీతంగా పెరిగి కంటి మీద కునుకు లేకుండా వస్తున్నాయని 18వ డివిజన్ ప్రజలు తమ సమస్యలను రెడ్డి అప్పల నాయుడు తెలియపరిచారు. దీనిపై జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ స్పందిస్తూ నగరపాలక సంస్థ అధికారులు, స్పందించి డివిజన్ లో ఎదుర్కొంటున్న సమస్యలుపరిష్కరించాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ కార్యాచరణ రూపొందించి డివిజన్ ప్రజల సమస్యలు పరిష్కారానికి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర అధ్యక్షుడు నగి రెడ్డి కాశి నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శిలు బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, కుర్మా సరళ, ఎట్రించి ధర్మేంద్ర, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సంయుక్త కార్యదర్శిలు వల్లూరి రమేష్, బుద్ధనాగేశ్వరరావు, కీర్తి కృష్ణ నాయుడు, సురేష్, కోశాధికారి పైడి లక్ష్మణరావు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చిత్తరి శివ, కోలా శివ, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, 1 టౌన్ మహిళా సంయుక్త కార్యదర్శి ప్రమీల రాణి, మహిళ కార్యదర్శి దుర్గా బి, స్థానిక నాయకులు దాసరి బాబి బొమ్మిడి సన్యాసిరావు, బెల్లం పైడిరాజు, భూపతి ప్రసాద్, సోంబాబు, దుర్గారావు, లహర్, రాజు, సాయిరాం సింగ్, వినోద్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విరమహిళలు పాల్గొన్నారు.