పల్లె పల్లెకు జనసేనతో చిల్లపల్లి 3వ రోజు

  • రెడ్డి సామాజిక వర్గంలో కూడా జనసేనకు ఆదరణ
  • యువత అంతా చిల్లపల్లి వెంట
  • రైతులపై జిఎస్టి బారం
  • బీసీ, దళిత, రెడ్డి వర్గాల్లో చిల్లపల్లి శ్రీనివాసరావుపై బలమైన నమ్మకం
  • నిడమర్రు గ్రామ సమస్యలపై నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి స్పందన
  • “పల్లె పల్లెకు జనసేనతో చిల్లపల్లి” కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో పర్యటన.

మంగళగిరి, “పల్లె పల్లెకు జనసేనతో చిల్లపల్లి” కార్యక్రమం మంగళగిరి మండలం, నిడమర్రు గ్రామంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 3వ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా రాజధాని గ్రామమైన నిడమర్రు లో రైతులను కలిసి వారి సమస్యల గురించి చర్చించడం జరిగింది. రైతులు వారి సమస్యలను చిల్లపల్లి శ్రీనివాసరావుకి వివరించారు. తదనంతరం రెడ్డి సామాజికవర్గ పెద్దలను కలిసి జనసేన పార్టీకి మద్దతు కోరగా గతంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన వారు కూడా రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో చిల్లపల్లి శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం కృషి చేస్తామని, ఈసారి జనసేన వెంట ప్రయాణిస్తామని తెలియజేశారు. అలాగే మాజీ జడ్పిటిసి కట్టెపోగు రత్న మాణిక్యంని వారి నివాసంలో కలిసి రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పనిచేయాలని కోరారు. అలాగే దళిత కుల పెద్దలను కలిసి దళిత వర్గాల సమస్యలపై చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి పెద్దలందరూ సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి కట్టెపోగు నవీన్ కుమార్ గారిని వారి నివాసంలో కలిసి గ్రామ సమస్యల గురించి చర్చించడం జరిగింది. అలాగే మంగళగిరి మండల సంయుక్త కార్యదర్శి నందిగం ప్రేమ్ కుమార్ ని వారి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఆధ్యంతం నిడమర్రు గ్రామంలో దళిత, బిసి, రెడ్డి వర్గాలలో అపూర్వ స్పందన రావడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని కోరారు. 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల అందరికీ కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, గుంటూరు జిల్లా నాయకులు, ఎంటిఎంసి కమిటీ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, మంగళగిరి నియోజకవర్గ మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాసం విభాగం కమిటీ సభ్యులు, మంగళగిరి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, చిల్లపల్లి యూత్ సభ్యులు, నిడమర్రు గ్రామ జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.