జనం కోసం జనసేన 422వ రోజు

జనం కోసం జనసేన 422వ రోజులో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 900 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 54500 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 423వ రోజు శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జగ్గంపేట మండలం రామవరం(యానాదుల కాలనీ) గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సోమవరం, జగ్గంపేట, కొత్తూరు, రాజపూడి, గోవిందపురం, గోనేడ, తామరాడ, కిర్లంపూడి, బూరుగుపూడి, మల్లేపల్లి, గండేపల్లి, కె గోపాలపురం గ్రామాలలో పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలాని శివాజీ, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి కుండ్లమహంతి స్వామి, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, ఇర్రిపాక గ్రామం నుండి చుక్కా బాబురావు, అరవాల నాని, కోటా జోగి నాయుడు, కూండ్రపు అశోక్, బూసాల అనిల్, బంక రాజు, కూనిశెట్టి దొరబాబు, మామిడాడ గ్రామ అధ్యక్షులు దెయ్యాల భద్ర, జె. కొత్తూరు నుండి పడాల దుర్గ, కాట్రావులపల్లి నుండి పసుపులేటి వెంకట సూర్యారావు, కృష్ణాపురం గ్రామం నుండి అమరపల్లి శ్రీనివాస్, సగరపేట నుండి నక్కా దుర్గారావు, ములికి శివరాం, గాది పెద్ద అప్పన్న, గాది నాగేంద్ర, గండికోట శ్రీను, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుసెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇర్రిపాక గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అరవాల నాని(అప్పారావు) కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.