బత్తుల ఆధ్వర్యంలో ఘనంగా రాజశ్యామల యాగం 4వ రోజు

రాజానగరం: లోకకళ్యాణార్ధం పవన్ కళ్యాణ్ రాజ్యాధికార ప్రాప్తి కోసం, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ దంపతులు నిర్వహిస్తున్న శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల మహాయాగం అవిఘ్నంగా జరుగుతున్న విషయం మనందరికీ విదితమే. ఈ మహా యాగంలో భాగంగా శనివారం కార్తీకమాస శుక్లపక్ష త్రయోదశి, శనివారం ఉదయం 9 గం॥ నుండి శ్రీ వినాయకపూజ, శ్రీ పుణ్యాహవచనం, శ్రీ పంచగవ్యం, శ్రీ సోమకుంభ పూజ, యాగగాల నిర్మాణం – అగ్ని సంగ్రహణం, తీర్థ సంగ్రహణం, శ్రీ దేవీ మహాత్స్య పారాయణ, శ్రీ గణపతి జపం,109 కుండం గణపతి దశాంశం, 109 కుండం శ్రీ సుబ్రహ్మణ్య శత్రు సంహార మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, దీపారాధన కర్యక్రమాలు జరిగినవి. కార్తీకమాస శుక్లపక్ష శనిత్రయోదశి, శనివారం తిధి కావున ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శనీశ్వర హోమం, శనీశ్వర అభిషేకం నిర్వహించడం జరిగినవి. శనిత్రయోదశి కావున మహాన్న ప్రసాద వితరణలో కూడా చమురు / నూనె ఉపయోగించకుండా మహాప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలననుసరించి నేతితో తయారు చేసిన మహా ప్రసాదాన్ని తయారు చేయడం భక్తులకు అందించడం దైవ సంకల్పం.