శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నిర్వహణ 4వ వారం

పిఠాపురం పశువుల సంత నందు ప్రతి వారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శంతో నిర్వహిస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నసదుపాయ కేంద్రం నందు శనివారం రైతులకు, పశువుల బేరాల మద్యవర్తులకు, వివిద హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు కలిపి 750 మందికి అన్నసదుపాయంను నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కల్పించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు అన్నం వడ్డించి తమ సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, బస్సా శ్రీ కాంత్, జ్యోతుల సీతరాంబాబు, రాయవరపు నవదీప్, జ్యోతుల నాని, విప్పర్తి‌‌ శ్రీను, నురుకుర్తి చంద్రశేఖర్, కొలా నాని, కీర్తి చిన్నా, నాగబోయిన వీరబాబు, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.