కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఆస్తి పన్నుపై వడ్డీలో 50% రాయితీ కల్పిస్తూ ప్రజలకు వెసులుబాటు కల్పించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మార్చి 31వ తేదీ లోగా తమ బకాయిలను చెల్లించుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సూచించారు. బుధవారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను ప్రస్తావించారు. వీటికి సంబంధించి వచ్చిన అర్జీలను సీనియర్ నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల స్వీకరించారు. ప్రభుత్వ పథకాల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన కట్టుబడి ఉన్నదని వారు తెలిపారు.
Share this content:
Post Comment